Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

కె సి ఆర్ కి బిస్కెట్ వేసిన మమతాబెనర్జి

పెద్దల సభకు చెందిన ఒక ఎంపీ గారు ఇచ్చిన సమాచారం మేరకు, కలకత్తా లో కాలిమత మొక్కు తీర్చుకోవాలి అనుకున్న కేసీఆర్ పనిలో పనిగా 3rd ఫ్రంట్ డ్...


పెద్దల సభకు చెందిన ఒక ఎంపీ గారు ఇచ్చిన సమాచారం మేరకు, కలకత్తా లో కాలిమత మొక్కు తీర్చుకోవాలి అనుకున్న కేసీఆర్ పనిలో పనిగా 3rd ఫ్రంట్ డ్రామా కూడా ముందుకు తీసుకెళ్లాలి అనుకున్నారు. దానిలో భాగంగానే అక్కడికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు. తన మంది మార్బలం తో పశ్చిమ బెంగాల్ సెక్రిటియేట్ కు చేరుకున్న గులాబీ బ్యాచ్ ను  మమతా ఎదురు  వచ్చి మరి లోపలికి తీసుకెళ్లారట, కేసీఆర్ సార్ ను మంచి చెడులు అడిగారట.  ఆ తరువాత మన సారు చాలా పెద్ద ఉపన్యాసం ఇవ్వడం స్టార్ట్ చేశారట, దేశానికి కాంగ్రెస్ బీజేపీ రెండు ఏమి చెయ్యలేవు, నేను మా రాష్ట్రం లో చాలా అభివృద్ధి చేశాను, రైతులకు చాలా పథకాలు తీసుకోచను అని చెప్తుంటే మమత శ్రద్ధగా విందట , కాసేపు అయ్యాక మమత బెనర్జీ కార్యదర్శి వచ్చి పార్లమెంట్ లో అవిశ్వాసం చర్చ కు రాలేదని సభను రేపటి వాయిదా వేసుకొని వెళ్లిపోయారని చెప్పారట దాని మమత ఎందుకలా అని ఆడిగిందట AIDMK, TRS  పార్టీ లో వెల్ లోకి వెళ్లి ఆందోళన చేశాయి దాన్ని సాకుగా చూపించి సభ వాయిదా వేశారు అని చెప్పాడట. దాంతో మమతా సీరియస్ గా తన స్టయిల్ లో ఏంటి కేసీఆర్ గారు ఇక్కడేమో బీజేపీ పై పోరాటం చేద్దాం అంటారు సభలో వాళ్ళకు సహకరిస్తారా??? ఇది ఎంత వరకు కరెక్ట్, మీ ఎంపీ లు మీ కంట్రోల్ లో లేరా అని నిలదీయడం తో, దానికి మన దొర గారు ఏదో సర్ది చెప్పబోతుంటే మీ దగ్గర ఇంకా చాలా విషయాల్లో స్పష్టత రావాల్సి ఉంది, మీ కూతురు కవిత గారిని కేంద్ర మంత్రి వర్గం లోకి తీసుకోమని  బీజేపీ లో మీ కులంకు సంబందించిన  ఒక  గవర్నర్ తో రాయబారం పంపించారు దాని పై ఇంకా చర్చలు జరుగుతున్నట్లు మాకు సమాచారం ఉంది అనడం తో అక్కడే ఉన్న కవిత గారు కలగచేసుకొని అది అబద్ధం మేడం అలాంటిది ఏమి లేదు అన్నారట దానికి మమతా నేను జాతీయస్థాయి నాయకురాలిని సాక్షాలు లేకుండా ఏది మాట్లాడను, నిజాయితీగా పోరాటం చేద్దాం అంటే రెడీ ఇలాంటివి నాకు నచ్చదు మమత బెనర్జీ మైండ్ సెట్ ను అర్థం చేసుకున్న పెద్దల సభ కు చెందిన ఎంపీ  మమతా తో ఉన్న పరిచయం కొద్దీ మీరే మాకు ఆదర్శం మేడం మా సీఎం గారు ఎప్పుడు మిమ్మల్ని గుర్తు చేస్తుంటారు మీ ఫైటింగ్ స్పిరిట్ నచ్చింది. మీ పాలన అద్భుతంగా ఉంది మేడం అని టాపిక్ ను కాస్త డైవర్ట్ చేశారట దాంతో కాస్త మమత బెనర్జీ చల్ల బడ్డాక సరే వెళ్తామ్ మేడం అని గులాబీ టీం లెవ్వడం తో సరే మళ్ళీ కలుద్దాం అని చెప్పి మమత బెనర్జీ లోపలికి వెళ్లబోతుంటే సదరు ఎంపీ గారు ఉండి మీరు కూడా ప్రెస్ మీట్ కు రావాలి మేడం ఒక ఉమ్మడి ప్రకటన చేద్దాం లేకపోతే మాకు ఇబ్బంది గా ఉంటుంది అనడం తో సరే అని ఉమ్మడి ప్రెస్ మీట్ కు ఒప్పుకుందట మమత బెనర్జీ దాంతో ఏదో అనుకుంటే మరేదో జరిగింది అనుకుంటూ గులాబీ బ్యాచ్ ఉసురుమంటూ బయటకు వచ్చారట. ఇదంతా తన గొప్ప తనంగా చెప్పుకోవడానికి సదరు పెద్దల సభ ఎంపీ గారు సన్నిహితుల దగ్గర చెప్పారు
*పాపం గులాబీ బ్యాచ్*

No comments