Page Nav

HIDE

Classic Header

{fbt_classic_header}

Top Ad

Popular Posts

Latest Posts

latest

ఈ రోజు భగినీ హస్త భోజనం - megaminds

ఈ మాట వినగానే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ ప్రచారకు లకి రోజూ భగినీ హస్త భోజనం.  ఆశ్చర్యంగా ఉందా!  సంఘ ప్రచారకులు తమ ఇళ్లను వదిలేసి స్వచ్ఛందంగా ...

ఈ మాట వినగానే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ ప్రచారకు లకి రోజూ భగినీ హస్త భోజనం.  ఆశ్చర్యంగా ఉందా!  సంఘ ప్రచారకులు తమ ఇళ్లను వదిలేసి స్వచ్ఛందంగా  కొన్ని సంవత్సరాలు కానీ , తన మొత్తం జీవితం సంఘానికి సమర్పణ చేస్తారు.

రోజంతా ఆ పని లో ఉండే ప్రచారకులు స్వయంసేవకుల ఇళ్లన్నీ తమ ఇళ్లే.  ఒక ఇంట్లో అల్పా హారం, పర్యటన చేస్తూ మరో ఇంట్లో భోజనం చేస్తూ ఉంటారు.  అన్ని కుటుంబాల సోదరీ మణులు తమ సోదర ప్రచారకునకు ఆనందగా, ఆత్మీయతని జోడించి భోజనం పెడతారు.

హిందూ సమాజం పనిని తమ పనిగా చేసేవారికి జగమంత కుటుంబం వారిది. అందరి ఇళ్లల్లో సభ్యులు వారు.  నేనైతే స్నానం, బట్టలుతుక్కోవడం కూడా స్వయంసేవకుల ఇళ్ళల్లోనే చేసుకునే వాడిని.  ఎన్ని వందల భగినీ హస్త భోజనం చేసేవాడినో చెప్పలేను.  అది సమాజం పట్ల బాధ్యతాయుతమైన శ్రద్ధ నిర్మాణమ్ చేస్తుంది.

కార్యాలయాలు లేని గ్రామాల్లో ప్రచారకల నిద్ర కూడా స్వయంసేవకుల ఇళ్ళల్లోనే.  ఆ కుటుంబ సభ్యుడిగా గడిపే జీవనం ప్రచారక్ కి ఎంతో జీవన సంతృప్తి ఉంటుంది.  చిన్న గ్రామాల్లో వర్గలు (ట్రైనింగ్ క్లాసెస్ ) జరిగినా ఆక్కయ్యలే ఒక్కో ఇంట్లో ఒక్కో వంట చేసి పంపిస్తారు
ఈ మధ్య సంఘ శిక్షా వర్గ లో కూడా 15 రోజుల పాటు శిక్షణ తీసుకునే వివిధ ప్రాంతాలనుండి వచ్చిన శిక్షార్థులకు మాతృ హస్తేన భోజనం అని 4, 5మంది శిక్షార్తులకి ఒక తల్లి భోజనం వండుకుని వచ్చి తినిపిస్తుంది.  అలా ఒక వర్గాల్లో 100 కుటుంబాల నుండి తల్లులు వంట చేసుకుని వచ్చి తినిపిస్తారు.

సంఘం లో పనులు, సిదాంతం శిక్షణ తో పాటు అన్ని కుటుంబాల లో కలిసి పోయి మసులుకునే పద్ధతిని అలవాటు చేస్తారు
సమాజం లో ఆదర్శ, సామాజిక స్థితి ఇలా కావాలని సంఘం శిక్షణ నిస్తుంది.
అందుకే సంఘం కేవలం స్వయంసేవక్ నే కాదు, మొత్తం కుటుంబం సంఘ కుటుంబం అవుతుంది. కొంత కాలం క్రితం అస్సాం లాంటి కొండ ప్రాంతాల నుండి యువకులను ముంబై లాంతో పెద్ద నగరాల్లో మన ఇల్లల్లోనే ఉంచి ఈ దేశం అంతా నాదే అనే భావన నిర్మాణం చేసాము.  ఇదంతా భగిని హస్త భోజనము కదా!.

కేవల. లైక్ చెయ్యడం కాదు. మీ అను భవాల్ని అనుభూతులను వ్రాయండి. షేర్ చేయండి.

నమస్సులతో మీ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..