Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

వివిధత్వం అభివృద్ధి చెందిన వృక్ష రూపం - megaminds

ఈ దేశంలో వివిధ పద్ధతుల వాళ్ళున్నా వాళ్ళ మధ్య విరోధం లేదు. ఒక చెట్టుకో ఒక కాండం బోలెడు కొమ్మలు, అంతకు మించి ఆకులు, పూవులు, కాయలు అన్నీ వేరు...

ఈ దేశంలో వివిధ పద్ధతుల వాళ్ళున్నా వాళ్ళ మధ్య విరోధం లేదు. ఒక చెట్టుకో ఒక కాండం బోలెడు కొమ్మలు, అంతకు మించి ఆకులు, పూవులు, కాయలు అన్నీ వేరువేరుగా ఉన్నా, వాటి రూపాలు, ప్రయోజనాలు, వేరువేరుగా ఉన్నా అన్నీ సహజాతులే, అన్నీ కలిపి ఒకే చెట్టు. ఇది మన ఐక్యత, ఏకత్వం. ఇది మనం చెప్పడం మానేసి వివిధత్వమే విరోధాల మయంగా సృష్టించాము.
అందుకే వివిధత్వం అభివృద్ధికి చిహ్నంగా కాకుండా విరోధాల పుట్టగా మార్చారు. ఇలా చేయడమే జాతి విద్రోహం. ఇలానే అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మబలికాము. నాయకులు తమ మాట చెల్లుబాటు కోసం తమకు తోచిన విధంగా జట్లు కట్టాము.
విభజించి పాలించే నాయకులకు వోట్ బ్యాంకు రాజకీయాలకు ఇది బాగా ఉపయోగించుకొని(అనే మాట కన్నా వాడుకొని) వాళ్ళ పబ్బం గడుపు కుండామనే ప్రక్రియ వాడుకున్నారు 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఇదే జరిగింది. ఈ గ్రూప్ల పేర్లు చెప్పడం బాగుండదేమో?
మోడీ వచ్చాక మైనారిటీ ల రక్షణే నాకర్తవ్యం అన లేదు. వెనుక పడ్డ వర్గాలు అనలేదు, మిడిల్ క్లాస్ అనలేదు. పాపం రాజ్యానికొచ్చిన నాటి నుండి 125 కోట్ల నా సోదర భారతీయులు అంటున్నారు. ఇది చాలా మందికి నచ్చలేదు. కాని నచ్చేవారి సంఖ్యా క్రమ క్రమంగా పెరుగుతున్నది. ఇది రాజకీయ నాయకులకు, విభజన వాదులకు మింగుడు పడని అంశం.
కాని కలిసి దేశం పని చేయడం, అవసరం ఉండేవాడికి సహాయం చేయడం. సహాయం అవసరం లేని వాడు తోటి వాడి కోసం వదిలేయడం అందరం ఒక కుటుంబం అనే ఆలోచన మొదలయ్యి ఫలితాలనిస్తున్నది. యువతకు ఈ విషయాలు అర్థం అవుతున్నాయి.
హిందుత్వం , మతతత్వ సమాన పదాలుగా ప్రచారం చేసింది అబద్ధం అని
అసలు మత తత్త్వం ఏమిటో, ఎవరు పెంచి పోషించారో దేశం అర్థం చేసుకుంటున్నది. ఇక దేశ అభివృద్ధి తథ్యము. యువకులు తమ కోసం, దేశం కోసం కష్టపడాలి. అభివృద్ధికి మనం సాధకులం కావాలి. మనమే యాచకులంలా ప్రభుత్వ సహాయానికి అర్రులు చాచడం మనకు మనమే తక్కువ చేసికోవడం అవుతుంది.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments