పార్శకోణాసన్ - అంతర్జాతీయ యోగా దినోత్సవం Parshvakonasana

megaminds
0

అంతర్జాతీయ యోగా దినోత్సవం


పార్శకోణాసన్: పార్శ్వ - పక్కవైపు, కోణ - కోణము - ఈ ఆసనం చివరిస్థితిలో శరీరం పక్కవైపులో కోణాకారంలో ఉంటుంది.

స్థితి: చక్కగా నిలబడి, కాళ్ల మడమలు దగ్గరగా ఉంచి, వేళ్లు కొంచెం దూరంగా ఉంచండి. గుండెలనిండా గాలిపీల్చి భుజాలు కిందికి జార్చి విశ్రాంతిగా నిలబడండి, మెడ నిటారుగా ఉండాలి. వేళ్లు నేలను చూస్తూ... అరచేతులు తొడలను తాకుతూ ఉండాలి. ముఖం ప్రశాంతంగా ఉండాలి.

1. శ్వాసను తీస్తూ... రెండుకాళ్లమధ్య 1. 1.5 మీటర్ల దూరం ఉండేట్లుగా నిలబడండి. రెండు పాదాలూ ఒకే వరుసలో ఉండాలి.
2. శరీరాన్ని కదిలించకుండా కుడిపాదాన్ని 90° కుడివైపుకు తిప్పండి. కోణంలో
3. శ్వాసను బయటికి విడుస్తూ... కుడివైపుకు వంగండి. కుడి తొడ నేలకు సమాంతరంగా ఉండాలి. కుడి అరచేతిని కుడిపాదం వైపు ఉంచండి. చేతివేళ్లు దగ్గరగా బయటికి చూస్తూ ఉండాలి. కుడివైపు శరీరం కుడి తొడని తాకుతూ ఉండాలి.
4. ఎడమ చేయి దండలు చెవిని తాకేట్లుగా చేయిని పైకి లేపండి. చేతివేళ్లు చూస్తూ... చేయిని నిటారుగా ఉంచండి. ఇదే చివరి స్థితి. సాధారణంగా శ్వాసించండి.
5. శ్వాసను లోనికి తీస్తూ ఎడమచేయిని నెమ్మదిగా ఎడమతొడపైకి తీసుకురండి.
6. శ్వాస తీస్తూనే నెమ్మదిగా నిటారుగా రండి. కుడికాలిని అలాగే ఉంచండి.
7. శ్వాసను వదిలిపెడుతూ కుడిపాదాన్ని 90° ఎడమవైపుకి జరపండి.
8. శ్వాస విడుస్తూనే... కుడికాలుని మామూలుస్థితికి తీసుకురండి. (ఎడమవైపు ఇలాగే ఇంకోసారి చేయండి.)

లాభాలు: గొంతు కండరాలు విచ్చుకుంటాయి, రొమ్ము కండరాలు గట్టిపడతాయి. చేతులు, మడమలు, మోకాళ్లు, నడుము, భుజాలు, దృఢంగా మారుతాయి. తొడ కండరాలు సాగి, విశ్రాంతిని పొందుతాయి. చక్కెర, మలబద్దకం తొలగిపోతాయి, కాళ్లు, మడమల నొప్పులు తగ్గుతాయి. విశాలత్వాన్నీ, విశ్రాంతిని కలిగిస్తుంది.

ముఖ్యాంశాలు:
1. కిందకి వంగేటప్పుడు, ముందుకు కాకుండా, పక్కకి మాత్రమే వంగాలి.
2. మొత్తం శరీరం బరువు ముందరి కాలిపైనే ఉండాలి. చేతిపై బరువు ఉండకూడదు.
3. ఎడమ అరచేయి చూడాలి.

శ్వాస: క్రిందికి వంగినపుడు శ్వాస వెలుపలికి తీయాలి పైకి లేచేప్పుడు లోనికి తీయాలి. చివరిస్థితిలో సాధారణ శ్వాస తీయాలి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.


International Yoga Day 2025, Yoga Day 2025, World Yoga Day 2025, Yoga Day theme 2025, Yoga Day date 2025, Yoga Day 2025 celebration, Yoga Day 2025 activities, Yoga Day 2025 speech, Yoga Day 2025 essay, Why is June 21 yoga day?, ఎందుకు జూన్ 21 యోగా రోజు?


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top