Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

దారం ఇది నా కథ.... - I am Thread, Its my Story

నేను దారాన్ని నా కథ మీకు చెప్పనా! నా కథ అందరి కథలా కాదు. నాకోసం కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటాయ్. నాదొక విషాదం నుండి ఆనంద...

నేను దారాన్ని నా కథ మీకు చెప్పనా! నా కథ అందరి కథలా కాదు. నాకోసం కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటాయ్. నాదొక విషాదం నుండి ఆనందం వైపు వెళ్లే కథ. నేను తయారయ్యే క్రమంలో కొన్ని కుటుంబాల్లో బాధలు ఉంటాయ్, కొన్ని కుటుంబాల్లో వెలుగులు ఉంటాయ్. అలాగే కొన్ని పురుగులు నాకోసం వాటి జీవితాలను పణంగా పెడతాయ్. గ్రామాల్లో ఎవరైనా రైతు చనిపోతే పత్తి రైతంటారు. లేదా పట్టు పురుగు రైతంటారు. ఆ ఆత్మ హత్యల్లో కూడా నన్నే ఉరి తాడుగా వాడటం సబబా! నాకోసం వేలాది కుటుంబాలు చిన్నాబిన్నమవుతాయ్, అయినా ఆ రైతు నా కోసం ఏదో చేయాలని తపిస్తూ పనిచేస్తాడు. అప్పుడో ఇప్పుడో నా ఇంట్లో కూడా ఆ తెల్ల బంగారం పండకపోదా అని ఎదురు చుస్తుంటాడు‌. నాకోసం జనపను పండించి తన కన్నీట్లో నానబెట్టి నన్ను బ్రతికించి, నాకు జీవం పోస్తాడు. నా వలన పరిశ్రమలు పెట్టి ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకున్నవారూ ఉన్నారు. కానీ ఏదో లాగా ఎక్కడో చోట రైతు నన్ను బ్రతికిస్తూనే ఉన్నాడు.

అలా నేను తయారయ్యాక ముందుగా నాకొక రంగుండదు, కానీ ఏ రంగులో నైనా అందంగానే ఉంటాను. నన్ను అన్ని రంగులతో అలంకరిస్తారు, నాకు ఆ రంగులంటే ఎంతో ఇష్టం.  అందుకే వాటిని నాలో ఇముడ్చుకుంటాను. నాకంటూ ఒక ఆకారం లేదు ఇలానే ఉండాలనీ అనుకోను. ముందుగా నన్ను ఈ భారతదేశం లో అయితే వొత్తి చేసి నాతో నూనె కలిపి వెలిగిస్తారు. ఆ క్రమంలో నేను సమిధనవుతూ సమాజానికి వెలుగునిస్తాను‌. కోట్లాదిమంది నాకు నమస్కరిస్తారు‌. నిజంగా చెప్పాలంటే నేను ఈ ధర్మానికి ప్రతీకను, రక్షను. ఆ తరువాత నేను కోట్లాదిమంది శరీరంపై జంద్యాన్ని, యజ్జోపవీతాన్ని, నన్ను తమ మెడలో వేసుకోవడానికి ఓ పండుగనే జరుపుకుంటారు. శ్రావణ మాసంలో పౌర్ణమి నాడే నన్ను ధరిస్తారు. నేను జంద్యంగా మారి వారికి విలువని తెస్తాను. ప్రతి ఆడపిల్లకు మెడలో తాళిబొట్టుకు (సూత్రం) కట్టే దారాన్ని నేను. ఈ నేలమీద పడ్డ మగశిశువుకి మొలతాడు నయ్యాను. కాశీ దారం అని నాకొక ప్రపంచంలోనే అతిపురాన నగరం పేరు కూడా పెట్టారు. దానిని మీరంతా చేతికి కూడా కట్టుకుంటారు. నన్ను కొంతమంది ఉదాహరణగా సమాజాన్ని కలపడానికి సూది దారం లా ఉండాలంటూ, కత్తెరలా ఉండొద్దు అని చెప్తారు. కత్తెరెకు కూడా నేనిష్టం నన్ను కత్తిరిస్తుంది.

రాఖీ పౌర్ణమి పేరుతో అన్నకి, తమ్ముడు కి అక్క చెల్లెళ్లు కట్టే రక్షా దారాన్ని. నేను లేకుంటే వాళ్ల బంధం లేనే లేదు. అందుకే నన్నక్కడ రాఖీ అన్నారు. ఏ శుభకార్యం జరిగినా రావి ఆకుకు, మామిడాకుకు నన్ను కట్టి మీ చేతికి కట్టకుండా ఏపనీ చేయరు మీరు. ఎన్నో పూలను మాలగా మార్చడానికి, వాటిని కలిపి ఉంచడానికి కట్టే దారాన్ని నేను, ఆధారాన్ని నేను. రైతు ఏ పంట పండించినా వాటిని ఓ సంచిలో పోసి వాటిని బయటకు జారకుండా చూసే బలాన్ని నేను. నన్ను ఉపయోగించి మొక్కలకి అంటు కట్టి బ్రతికిస్తారు. ఆ మొక్కల చెట్లయి మీకు నీడను, పండ్లనిస్తాయి నా ఆసరాతోనేగా మీరు తినేది.

నేను నూలుపోగుగా, ఒంటరిగా ఉన్నప్పుడే ఎన్నో చేశాను. అలాంటిది నేనొక తాడుగా మారితే మదపుటేనుగులు సైతం నా బలానికి నిలుచుంటాయ్. ఎన్నో వాహనాలు నన్ను ఆదారం చేసుకుని నడుస్తుంటాయ్. నేను అంతరిక్ష పరిశోదనల్లో సైతం పనికొస్తాను.

ఈ ప్రపంచమే బట్టల్లేకుండా ఉన్నప్పుడు నా ద్వారా సమాజానికి  మానవ విలువలనిచ్చాను. మీ ఒంటిపై గుడ్డనయ్యాను. ఇక అప్పటినుండి ఇప్పటి వరకు ఎన్నో రంగుల్లో మీరు ధరిస్తూనే ఉన్నారు. నేను లేకపోతే మీరు లేనే లేరన్నట్టు చేశాను. నా కోసం పిల్లల నుండి పెద్దల వరకు పండగొస్తే పరుగులుతీస్తారు. ఎందుకంటే నేను దారాన్ని మీకు ఆధారాన్ని మళ్ళీ చెబుతున్నా నేను లేకపోతే మీరు లేరు.

చివరకు నన్ను మీరు ఓ పాడయిన ప్లాస్టిక్ వస్తువు నుండి తయారుచేసినా మీకు చెప్పులకు, బూటు లేసులకి ఉపయోగపడుతూనే ఉన్నాను. అంతెందుకు నేను లేదంటే ఈ దేశ స్వాతంత్ర్యమే లేదు, విప్లవమే లేదు, ఉద్యమమే లేదు.

అదే నేను ఈ దేశ స్వాతంత్ర్యానికి స్వదేశీ ఉద్యమాన్ని, రాట్నానికి ఉన్న నూలుపోగుని, మీ అందరికి ఆధారాన్ని. నన్ను ఆధారంగా చేసుకుని మీరు స్వాతంత్ర్యం పొందారనేది నిజంకాదా?. ఈ దేశ చేనేతకారులు చతికిల పడి, బలహీనపడుతుంటే నేను మీలో విప్లవాన్ని రగిలించి కోట్లాదిమంది లో ప్రేరణ కలిగించి. అన్నార్తుల ఆకలి తీర్చే వేడుకనయ్యాను, మీకు తోడయ్యాను.

ఈ రోజు ప్రపంచం లో మీరు ఆర్థికంగా నిలబడ్డారంటే నేను కాదా? నన్ను విదేశాలకమ్మే కదా మీరు అభివృద్ది చెందుతున్నారు. ఫార్మ్ టు ఫ్యాబ్రిక్, ఫ్యాబ్రిక్ టు ఫ్యాషన్ గా మారి ప్రంపంచ వేదికల మీద నా గురించే కదా మాట్లాడుకుంటున్నారు. నన్ను ఆంగ్లం లో Thread అంటారు, నాపనితనం తెలుసుకుని Java లో Threads అనే ఒక Concept ద్వారా కోడింగ్ చేయొచ్చు. అలాగే ఈ మధ్యనే Thread అనే పేరుతో అందరినీ కలపడానికి ఒక సోషల్ మీడియా యాప్ కూడా వచ్చింది అది నేనంటే. 

నేను మీకోసం ఎంతలా మారానంటే ఓ గంట సేపు నాపై దృష్టిపెట్టి అల్లిక చేస్తే మీ కుటుంబాన్ని పోషించేంత. మీలో జవసత్వం లేదు, లక్షలాది మంది యజ్జోపవీతంగా నన్ను ధరించిన శరీరాలను ముక్కలుగా కోసి, ఆ జంద్యాలను కేజీలుగా తూకం వేసినా మీలో చలనం లేదనే బాధ నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఇంతచేసిన నన్ను మీరు ఎలా చూస్తున్నారు, ఓ దారంగానే చూస్తున్నారు. అందుకే తప్పక నేను కొంతన్నా నా గురించి మీకు చెప్పాలని, కనువిప్పుకలిగించాలని చెప్పదలచాను. మీరు పోగు పోగులుగా పోగేసినా చివరకు నా నూలుపోగంత కూడా మిగిలుండరు, కనుక జీవించినంత కాలం అన్ని రంగులను నేను ఎలా ఇముడ్చుకున్నానో, మీరూ అందరితో కలిసి సంఘటిత శక్తిగా మారి ప్రపంచానికి శాంతినివ్వాలని ఆశిస్తూ మీ దారాన్ని. ఆధారాన్ని. జయ్ హింద్. -రాజశేఖర్ నన్నపనేని. 085005 81928

1 comment

  1. 🙏Ninnu Pandinche Rithuku Padhabhi Vandhanalu 👏 JAI SRI RAM 👏 BHARAT MATA KI JAI 💪 VANDHE MATARAM 🇮🇳 SATYA MEVA JAYATE 💓😌👏 JAI HIND 🙏

    ReplyDelete