Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

వినాయకుడు మామూలోడు కాదు - Lord Vinayaka importance in Telugu

ఈయన మామూలోడు కాదు...🙏 చూడ్డానికి విచిత్రంగా కనపడతాడు..  కానీ ఒక్కొక్క అవతారంలో వచ్చి...ఒక్కో రాక్షసుణ్ణి ఉతికి ఆరేసాడు... మత్సర...

ఈయన మామూలోడు కాదు...🙏

చూడ్డానికి విచిత్రంగా కనపడతాడు.. 

కానీ ఒక్కొక్క అవతారంలో వచ్చి...ఒక్కో రాక్షసుణ్ణి ఉతికి ఆరేసాడు...

మత్సరాసురుణ్ణి .. మదాసురిణ్ణి ... క్రోధాసురుడ్ని.. ఇలా అరిష్డ్వర్గాలను చంపి పారేశాడు...

పుట్టిన తరువాత తండ్రి శివుడితో గజాసురుని చంపించాడు...

కుమార స్వామి తో తారకాసురుడుని చంపేలా చేశాడు...

ఏదో... అలా సాత్వికంగా కూర్చున్నట్టు కనపడతాడు అంతే...

ఏదైనా పని మొదలెడితే చాలు...విఘ్నాలే కదా ఎవరికైనా..

వాటిని ... తరుముతాడు.. ఉరికిస్తాడు..

ఘంటం చేతికిస్తే...భారతం మొత్తం వ్రాసే వరకూ వదలని మొండిఘటం...

ప్రయాణానికి పెద్ద పెద్ద వాహనాలు..రథాలు అక్కర్లేదు...చిట్టెలుక చాలు...

బాగా వింటాడు పెద్ద పెద్ద చెవులు చేసుకుని... చక్కగా తింటాడు... పుష్టిగా ఉంటాడు..

నిశితమైన... ఏకాగ్రచిత్తంతో...కళ్ళు చికిలించుకుని చూస్తాడు..

పుణ్యం కోసం.. గణాధిపత్యం కోసం...తల్లి తండ్రుల చుట్టూ తిరిగితే చాలు...వాళ్ళని ప్రసన్నం చేసుకుంటే చాలు అన్న ఇంగితం...

ప్రకృతి తో...పచ్చదనంతో కలిసిపోయిన జీవితం...

శరీరం ఎలా ఉన్నా...బుద్ధి బలం ఉంటే...ఏదైనా సిద్ధింప జేసుకోవచ్చని...సంకేతం...

ఇట్లాంటి వాడ్ని పూజిస్తే...ఆరాధిస్తే... ఏ పన్లు సాధ్యం కావు చెప్పండి...

అందుకే.. పూజ్యనీయ గురూజీ...మనం అంతా వినాయకుణ్ణి...దుర్గా మాతను పూజించాలని చెప్పారు..

తిలక్ మహాశయుడు...సామూహికంగా ఈయన్ని ఆరాధించాలని చెప్పారు...

అందుకే...ఇప్పుడు... ఈ తొమ్మిది రోజులూ.. ఇల్లిల్లూ...గల్లీ గల్లీ శక్తి కేంద్రాలుగా మారిపోతాయి...

అందరం శక్తి ఉపాసకులం అయిపోతాం...

రండి భారత మాత వైభవం కోసం... 

గరికను సైతం మంత్రించి...ఆయుధం చెయ్యగలుగుతాం..

దేశ వ్యతిరేకుల పీచమణచగలుగుతాం...

వినాయక చవితి శుభాకాంక్షలు ❤️❤️🎉🙏🙏🙏
జై గణేష్...
జై హింద్... - మంగళంపల్లి శ్రీ హరి.

No comments