Page Nav

HIDE

Gradient Skin

Gradient_Skin

Pages

JUST IN

latest

ఆత్మహత్య నివారణ దినం 10 సెప్టెంబర్ - About suicide prevention day in telugu

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినం -10 సెప్టెంబర్ WHO ప్రకారమఒ ప్రపంచములో ప్రతి 40 సెకనులకు ఒకరు ఆత్మహత్య తో మరణిస్తున్నారట . సంవత్సరానికి సుమ...


ప్రపంచ ఆత్మహత్య నివారణ దినం -10 సెప్టెంబర్ WHO ప్రకారమఒ ప్రపంచములో ప్రతి 40 సెకనులకు ఒకరు ఆత్మహత్య తో మరణిస్తున్నారట . సంవత్సరానికి సుమారు ఒక మిలియన్‌ మంది చనిపోతున్నారు . ఎన్నో కారణాలు . 1960 స్వర్గీయ ప్రఫెషర్ ఎర్విన్‌ రింగెల్ & డా.నామన్‌ ఫార్ బెరో " ఇంటర్నేషనల్ అస్సోసియేషన్‌ ఫొర్ సూయిసైడల్ ప్రివెన్‌షన్‌ (IASP) ని స్థాపించారు . ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌ తో కలిసి పనిచేస్తుంది . ఈ రోజు ప్రపంచమంతా ఆత్మహత్యల నివారణకోసం సభలు , సమావేశాలు నిర్వహిస్తారు .
జీవితం అంటే ఇంతే కాదు. సమస్యలు నీ ఒక్కరికే కాదు. అందరికీ ఉంటాయి. వాటిని అధిగమించడమే చేయాల్సింది అని వివరించాలి. మేలుకోల్పాలి. ఉద్యాన నగరం జీవితమంటే, సుఖాలొక్కటే కాదు సుఖాలతో పాటూ కష్టాలూ కన్నీళ్లూ ఉంటాయి నిరుపేదకైనా ధనవంతులకైనా ఇవి తప్పవు  మనిషి తనను తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవటం , మానవ అపసామన్య స్థితిని తెలియజేస్తుంది . మనిషి తన జీవితాన్ని అంతం చేసుకోవాలని విపరీతమైన ఆలోచనలు చేయడాన్ని వైద్య బాషలో పారాసూసైడ్ అంటారు . ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన, ఆత్మహత్య ప్రయత్నం రెండు కూడా తీవ్రమైనవి గా పరిగణించాలి . సైకోటిక్ రియాక్షన్ ఫలితంగా కూడా ఏర్పడుతాయని, మనిషి నిస్సహయుడిగా మిగిలిపోవటం, భవిష్యత్ అంధకారంగా కన్పించటం, మానసిక ఒత్తిడి, జీవితంలో మనోవ్యాధికి లోనయ్యే వ్యక్తులు, ఈ చర్యలకు ఎక్కువగా పాల్పడుతారు.
ఆత్మహత్య చేసుకోవడం వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉంటాయి. తీవ్రమైన నిరసన తెలపడం, అభద్రతాభావం, తన గోడు వినే వారు ఎవరూ లేరే అన్న బాధ. ఈ మూడు కారణాలలో ఏదో ఒకటి ఆత్మహత్యకు పురిగొల్పుతుంది. ఒక వ్యక్తిపై లేక ఉద్యమం పై తీవ్రమైన అభిమానం, ప్రేమ, అనుబంధం పెంచుకునేది యువతీయువకులే. అభిమాన హీరో కావచ్చు. అభిమాన నాయకుడు కావచ్చు. అలాంటి వారికి అనుకోని విపత్తు వచ్చినప్పుడు అభిమానులు తట్టుకోలేకపోతారు. ఒక రకమైన అభద్రతా భావానికి లోనవుతారు.
ఆత్మహత్యలు చేసుకునే యువకుల్లో ఎక్కువ భాగం నగరంలోని హాస్టల్స్‌లో ఉండి చదువు కుంటున్నవారే. వీరంతా ఫ్యామిలీ రిలేషన్స్‌కు దూరంగా ఉంటున్నవారే. తన మాట వినే వారు ఉన్నారు అని వారు భావించినపుడు వారిలో ఆత్మహత్య ఆలోచనే తలెత్తదు. మానసిక సంఘర్షణకు లోనవుతున్న వ్యక్తికి తన వేదనను విని ఊరట కలిగించే మాటలు కావాలి. ధైర్యం చెప్పే వచనాలు కావాలి.
చేనేత కార్మికులు,రైతుల ఆత్మహత్యలు:
సిరిసిల్లా ,అంతర్గాం తదితర చోట్ల చేనేత కార్మికులు వారి వృత్తుల్లో దిన దినం ఏర్పడుతున్న మానిసిక సంక్షోభంతో అల్లకల్లోలం అవుతున్న కుటుంబాల దీన స్థితికి అద్దం పడుతున్న పరిస్థితుల్లో రోజు దిన పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. అప్పుల తిప్పలతో ఆ పేద కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఆత్మబలిదాన పీఠం ఎక్కుతు వందేళ్ల జీవితాన్ని మొగ్గలోనే తుంచుకుంటున్నారు. వీదిన పడ్డ ఆ కుటుంబాల పరిస్థితి చూస్తే ఆ తీవ్రతకి కారణం ఎవరు. ఆపేద కార్మికుల దీన గాథలకు ఆదుకునే నాథుడెవరు అనేది తెలుసుకుంటే ఆ సమస్యకు పరిష్కారం దోరకలేదా. ఇక పెరుగుతున్న ధరలు, పెస్టిసైడ్స్‌, ఎరువులు , విత్తనాలు ఆమాంతం పెరిగి కష్టించి ఓళ్లు గుల్ల చేసుకొని తీరా పంట వస్తే గిట్టు బాటు దర లభించడంలేదు. వ్యవసాయానికి బ్యాంకుల్లోను సోసైటిల్లోను, అప్పులు ఇచ్చే దాతల దగ్గర తీసుకొన్న రుణాలు కట్టలేక కుటుంబాన్ని పోషించుకోలేక అనుదిన ఆకళ్లతో మానసిక సంఘర్షణలతో రైతులు ఊరి వేసుకొని మరణిస్తున్న సంగతి తెల్సిందే. వీటిని నివారించడానికి సభ్య ప్రపంచం, ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించి పరిష్కారమార్గాలను వెతికితే బాగుంటుందనేది ఆపేద మూగ జీవాల రోధన గా ఉన్నాయి.
ప్రేమలు, పెళ్లిల్లు,అత్యాచారాలతో అసువులు:
సినీ,టివి ప్రభావం విలాసవంత జీవన కోరికలు వెరసి ఆధునిక యువత హైటెక్‌ వేగంతో పరుగులు తీస్తున్నది. ప్రేమ గుడ్డిదన్నట్టే అందంతో పనిలేక ఆకర్షణలతో దగ్గరవుతున్న యువత ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ క్రమంలో ప్రేమల్లో ఏర్పడుతున్న అంతరాలు, వర్ణాదర్మాలు, నిరుద్యోగ బాధలు ఇలా అనేక రకాలతో పెళ్లిళ్లు అంక్షంతలకు నోచుకోక కన్నీళ్ల పర్యంతమవుతు ఆత్మహత్యల వైపు వారిని తీసుకెళ్తున్న ఘటనలు కోకొల్లలు . వన్‌ సైడ్‌ ప్రేమల వల్ల యువత మనస్సు చెదిరి కిడ్నాప్‌లు, ఆసిడ్‌ దాడులు , అఘాయిత్యాలు,అత్యాచారాలు లేదంటే చంపడమో తాము చావడమే చేసుకుంటున్న పరిస్థితులు ఈనాటికి కూడ కనబడుతూనే ఉన్నాయి. ఇంకో వైపు వివాహేతర సంబందాలతో ఎందరో హత్యల బారీన పడుతున్న సంఘటనలు చూస్తునే ఉన్నాం. వీటిన్నింటిని సమగ్రముగా పరిశీలించి సామాజిక అవగాహనను ప్రజల్లో,యువతల్లో కలిపించడానికి మార్గాలను వెతికి వారికి జీవనాదార పరిస్థితులను కల్పిస్తు అకాల ఆలోచనల నివారణకు శ్రీకారం చుట్టే విధంగా వారిలో మార్పు తీసుకు వచ్చే ప్రయత్నాన్ని చూడాలి.
ఉద్యోగాలు లేక:
చదివిన చదువులకు ఉద్యోగాలు రాక రోజువారి ఇంటర్యూలకు వెలుతు ఉద్యోగం దొరక్క పోయేసరికి విచారంతో కృంగి పోయే పరిస్థితికి దారి తీస్తున్న వైనాలు ఏన్నో. చదువుల్లో ఉత్తీర్ణత సాదించలేక ఫెయిల్‌ అయినామనే బాధతో ఆత్మహత్యల బారీన పడుతున్న విద్యార్దులు ఎందరో... నిన్నటి ఎస్సెస్సీ పరీక్షల్లో తప్పిన నిజామాబాద్‌ నగరరానికి చెందిన దీపిక మరణం వరకు ఎన్నో విషాద సంఘటనలు జరుగుతునే ఉన్నాయి. వీరిలో ఈ ఆత్మన్యూనతా భావాన్ని తోలగించడం ఎలా... చిన్న నాటినుండే తల్లి దండ్రుల, ఉపాద్యాయులు విద్యార్దుల్లో ఇలాంటి మానసిక సంఘర్షణలు ఏర్పడకుండా హితోక్తులతో కూడిన గత సంఘటనల నేపథ్యాలను వివరిస్తు బతికుంటే బలుసాకు తినచ్చు. ఒక రకంగా కాకుంటే మరో రకంగా ప్రత్యామ్నాయా పరిస్థితులు సమాజంతో వివధ ఉద్యోగ రంగాల ద్వార అనుకున్నది సాదించుకొవచ్చనే నమ్మకాన్ని వారిలో చిన్న నాటి నుండే కల్గిస్తే ఈ ఆత్మహత్యల నిరోదాన్ని నివారించుకొవచ్చు.
ఇండియాలో స్వస్థలాలలో అప్పులలో మునిగిపోయి, ఏజెంట్ల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి తీర్చలేని ప్రవాస భారతీయ కార్మికులు సాధారణంగా ఆత్మహత్య చేసుకుంటుంటారని భారత దౌత్యాధికారి ఒకరు చెప్పినట్లుగా అరబ్‌ న్యూస్‌ తెలియజేసింది.
ఇలా....‘వస్తువుని కలిగి ఉండటమే ప్రతిష్ఠకు నిదర్శనం’ అనే భ్రమలు పెరిగి.... సదరు వస్తువుల్ని సమకూర్చుకోలేక పోయినపుడు, అభం శుభం తెలియని కొందరు పిల్లలు, భావోద్రేకపూరితులై యువకులూ.... నిరాశానిస్పృహలకీ, ఆత్మన్యూనతకీ గురికావటం కూడా జరుగుతోంది. తాము కోరిన సెల్ ఫోన్ తండ్రి కొననందుకు, బైక్ కొననందుకు ఆత్మహత్యలు చేసుకున్న పదేళ్ళ పిల్లల నుండి, ఇరవై ఏళ్ళ యువకుల గురించి, ఎన్నో వార్తలు అప్రధాన్య అంశాలుగా వెళ్ళిపోతుంటాయి.
భావాలని, బంధాలని, అనుభూతుల్ని ఆనందించటం మాని, కేవలం వస్తువులూ, ద్రవ్యమూ, డబ్బే ఆనందదాయకమనుకొని, ఎండమావుల వెంట పరుగు పెడుతున్న పరిణామ ఫలితం ఇది!
పరిష్కారామేలాగో సమాజమే కనిపెట్టాలి:
సమాజం, స్వచ్చంద సంస్థలు ప్రభుత్వం యువత, ఆత్మహత్యల ద్వారా చిన్నాబిన్నమైన కుటుంబాలు పోలీసు వ్యవస్థ ఆత్మహత్యలులేని సమాజ నిర్మాణానికి ప్రయత్నం చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. కలిసి కట్టుగా దీనిపై శ్రద్ద వహిస్తు ఉంటే ఆత్మ న్యూనతా భావంతో క్షణికావేశంతో అసువులు బాస్తున్న ప్రజల్ని రక్షించుకోవచ్చు . టివిల్లో వార్తా కథానాల్లో చూపిందే పదే పదేగా ఇలాంటి సంఘటనలు చూపకుండా కట్టుదిట్ట చర్యల్ని చేపడితే ఆ విషాద ఘటనల నుండి ప్రజలను దూరంగా తీసుకెళ్లవచ్చు. ప్రజల్లో, యువతలో మానిసిక సంఘర్షణ జరుగకుండా మానిసిక వత్తిడిని జయించడానికి వారికి అవగాహాన కల్పించాల్సిన అవసరం నేటి తరుణంలో ఉన్నది. దానికై పాదులు కలుపుదాం...పరేషాన్‌లు కాకుండా చూద్దాం...కన్నీళ్లు లేని కుటుంబాల్ని ఊహించుకుందాం...ప్రజల్ని,యువతను కాపాడుకుందాం...
ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే వ్యక్తికి ఆఖరి నిమిషంలో భరోసా లభించినా తన ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. నానాటికి క్షీణించి పోతున్న మౌళిక విలువలు, పెరుగుతున్న మానసిక సంఘర్షణ వగైరా వగైరా ఎన్నో ఆత్మహత్యలు ప్రేరణలుగా ఉన్నాయ. సాంఘిక సంబంధాలు వాతావరణంలో మార్పులు తీసుకుని రావటం ద్వారా జీవన విధానంలో మలుపులు ఏర్పడుతాయని, సామాజిక ప్రశంస సమృద్ధిగా లభించిన వ్యక్తి అలోచనలు ఆరోగ్యకరంగా సాగుతాయ.

No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..