Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

జగన్నాథుని మహా నైవేద్యముల ప్రత్యేకత - megamindsindia

జగన్నాథుని మహా నైవేద్యముల ప్రత్యేకత.... ఛప్పన్న భోగాల నిత్య నైవేద్యాలు ఆరగించే జగన్నాథుని వైభోగం వర్ణనా తీతం. పూరీ ఆలయంలోని నైవేద్యాలను ...

జగన్నాథుని మహా నైవేద్యముల ప్రత్యేకత....
ఛప్పన్న భోగాల నిత్య నైవేద్యాలు ఆరగించే జగన్నాథుని వైభోగం వర్ణనా తీతం. పూరీ ఆలయంలోని నైవేద్యాలను సిద్ధం చేసే భోగమంటపం (వంటశాల) ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. జగన్నాథునికి ఛప్పన్న (56) ప్రసాదాలను, రోజుకు ఆరుసార్లు నివేదిస్తారు. జగన్నాథునికి నివేదన పూర్తయిన తర్వాత క్షేత్రపా లిక అయిన విమలాదేవికి నివేదించి, ఆ ప్రసాదాలను ఆలయ ఈశాన్యభాగాన ఉండే 'ఆనంద బజార్' లో భక్తులకు విక్రయిస్తారు. ప్రసాదాలను వండటానికి ఎప్పటికప్పుడు కొత్త మట్టి కుండలనే ఉపయోగిస్తారు. కట్టెల పొయ్యిలపై వండు తారు. భోగ మంటపానికి చేరువలోని 'గంగ', 'యమున' అనే రెండు బావుల్లోని నీటిని మాత్రమే వంటకాలకు ఉపయోగిస్తారు. ప్రతిరోజూ ఏకకాలంలో యాభై వేల మందికి సరిపోయేలా ఇక్కడ ప్రసాదాలను తయారు చేస్తారు. పర్వదినాల్లో | నైతే లక్షమందికి సరిపోయేలా తయారు చేస్తారు. ఏకకాలంలో లక్షమంది కూర్చుని | భోజనం చేయగలిగేంత విశాలమైన భోజనశాల ఇక్కడి ప్రత్యేకత. జగన్నాథునికి నివేదించే ప్రసాదాలను 'మహాప్రసాదం'గా పరిగణిస్తారు. మహాప్రసాదాన్ని ఆర గిస్తే మనోభీష్టాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. పూరీలో నివేదించే ఛప్పన్న భోగాలేమిటంటే... 1. అన్నం 2. కనికా (బియ్యం , నెయ్యి, పంచదారతో తయారు చేస్తారు) 3. దొహి పొఖాహ్ (నీట్లో నానిన అన్నానికి పెరుగు కలిపి తయారు చేస్తారు) 4. ఒద్దా పొఖాళా (నీట్లో నానిన అన్నానికి అల్లం కలుపుతారు) 5. తీపి కిచిడీ (బియ్యం , పెసరపప్పు, నెయ్యి, పంచదారతో చేస్తారు) 6. నేతి అన్నం 7. కిచిడీ 8. మిఠా పొఖాళి (నీట్లో నానిన అన్నానికి పంచదార కలుపుతారు)
9. ఒరియా పొఖాళి (బియ్యం, నెయ్యి, నిమ్మరసం, ఉప్పుతో చేస్తారు) 10. కాజా 11. గొజ్జా (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేసే మిఠాయి) 12. లడ్డు 18. మగజా లడ్డు (గోధుమపిండితో చేసే లడ్డు) 14. జీరాలడ్డు (గోధుమపిండికి జీలకర్ర చేర్చి తయారు చేసే లడ్డు) 15. వల్లభ (గోధుమపిండితో చేసే ఒక ప్రత్యేక మిఠాయి) 16. ఖురుమా (గోధుమపిండి, పంచదార, ఉప్పుతో చేస్తారు) 17. మొథాపులి (మినుములు, నెయ్యి, పంచదారతో చేస్తారు) 18. కకరా (గోధుమపిండి, కొబ్బరికోరు, పంచదారతో చేస్తారు) 19. మరిచి లడ్డు (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 20. లుణి ఖురుమా (గోధుమపిండి, నెయ్యి, ఉప్పుతో చేస్తారు) 21. సువార్ పిఠా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 22. జొడెయి లొడా (గోధుమలు, నెయ్యి, పంచదారతో చేస్తారు) 23. యిలి (వరిపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు) 24. కొంటి (వరిపిండి, నెయ్యితో చేస్తారు) 25. మండా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 26. ఒమాళు (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు) 27. పూరీ 28. లుచి (వరిపిండి, నెయ్యితో చేస్తారు) 29. బొరా (మినప్పప్పుతో చేసే వడలు) 30. దొహిబొరా (పెరుగు గారెలు) 31. అరిసె 32. త్రిపురి (వరిపిండి, నెయ్యితో చేస్తారు) 33. రోసాపాయిక (గోధుమలతో చేస్తారు) 34. ఖిరి (పాయసం) 35. పాపుడి (పాలమీగడ, పంచదారతో చేస్తారు) 36. కోవా 37. రొసాబొళి (పాలు, పంచదార, గోధుమలతో చేస్తారు) 38. తడియా (తాజా పనీర్, నెయ్యి, పంచదారతో చేస్తారు) 39. ఛెనాభాయి (తాజా పనీర్, పంచదార, పాలతో చేస్తారు) 40. బపుడి ఖోజా (పాలమీగడ, నెయ్యి, పంచదారతో చేస్తారు) 41. ఖువా మండా (పాలు, గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 42. సొరాపులి (పాలను గంటల తరబడి మరిగించి చేసే మిఠాయి) 43. డల్లి (కందిపప్పుతో చేసే ముద్దపప్పు) 44. ముగోడల్లి (పెసరపప్పు వంటకం) 45. బిరిడల్లి (మినుములతో చేసే పప్పు) 46. ఉరద్ డల్లి (మినప్పప్పు వంటకం) 47. దాం (కందిపప్పు, కాయగూరలు కలిపి చేసే వంటకం) 48. మవుర్ (పప్పులు, కొర్రలతో చేసే వంటకం) 49. బేసొరొ (కలగూర వంటకం) 50. సగో (తోటకూర వంటకం) 51. పొటోలో రొసా (పొటల్స్/పర్వల్ కూర) 52. గోటి బైగొణా (గుత్తివంకాయ కూర) 53. ఖోటా (చింతపండు గుజ్జు, బెల్లంతో చేసే లేహ్యం) 54. రైతా (పెరుగులో కూరగాయల ముక్కలు వేసి చేస్తారు) 55. పిఠా (గోధుమపిండితో చేసే తీపిరొట్టె) 56. బైగని (వంకాయలతో చేసే వంటకం)
సర్వేజనా సుఖినోభవంతు..
గో బ్రాహ్మణేభ్యః శుభం భవంతు..
స్వస్తి..

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments