Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

యువకులు దేశ కార్యం ఎలా చేయాలి-4 - megaminds

దేశం లో పాత వృత్తులు మారుతున్నాయి. కొత్తవి పుట్టుకొస్తున్నాయి. సమాజం యొక్క నాగరికత త్వరగా మారి పోతున్నది. సంపాదన ప్రాతిపదికగా చదువుల ఎం...


దేశం లో పాత వృత్తులు మారుతున్నాయి. కొత్తవి పుట్టుకొస్తున్నాయి. సమాజం యొక్క నాగరికత త్వరగా మారి పోతున్నది. సంపాదన ప్రాతిపదికగా చదువుల ఎంపిక జరుగు తున్నది. దక్షిణాదిలో అయితే మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుపై శ్రద్ధ పెరిగింది. నీతి శాస్త్రం అంటే అదేదో చేతగాని వాడి భాష అయిపొయింది. ఏదైనా పోటీ, ప్రైజ్ ఉండేవే పిల్లలు ఆదరిస్తున్నారు.
నేను సంఘం లో ఒక హిందీ పాత నేర్చుకున్నాను. నిర్మాణోకే పావన యుగ మే, హం చరిత్ర నిర్మాణ్ నా భూలే, అంటే కొత్తవి తయారూ చేసే ఈ యుగంలో, మనం శీల నిర్మాణం మరిచి పోవద్దు అని అర్థం. ఆ నీతి మనం ఇదివరలో నీతి శతకాలు కంఠస్థం చేయించే వారు. ఇప్పుడు కంఠస్థం చేయడం వెనుక పడ్డ విద్య. కంఠస్థం పోయింది, నీతి, శీలం నేర్చుకోవడం పోయింది. సంఘం నిర్వహించే శిశుమందిరాలు తప్ప మిగతా చోట్ల అవి కనపడవు.
వాటి కంఠస్థం కాంపీటీషన్ పెడితే పిల్లలు నేర్చుకుంటారు. ఈ పద్యాలు చదివినప్పుడు ఉపయోగం గా కనిపించక పోయినా, మనిషి ని జీవితం లో మంచి నడవడికి చుక్కాని అవుతాయి. ఇది మన సంఘ వాళ్ళే అనుకుంటారు అనుకునే వాళ్ళం. కాని చాలా కోణాల్లో ఇవి ముఖ్యం అని తలచి వారున్నారు.
ఒకసారి గుంటూరు D I G శ్రీ రామ స్వామీ గారితో మాట్లాడటానికి మాననీయ భాగయ్య గారితో కలిసి వెళ్ళాము. వారిని ఒక కార్యక్రమానికి అతిధి గా పిలిచాము. వారు అత్యంత సామాన్య ఉపేక్షిత బంధు సమాజం నుండి వచ్చిన IPS ఆఫీసెర్. వారు ఒప్పుకున్నారు. పిల్లలో నీతి పద్యాలు నేర్పుతున్నారా? అని ప్రశ్నించారు. నెలకు ఒక సుభాషితం నేర్పితాము, అది సంస్కృతం లో ఉంటుంది అని చెప్పాం. అలా కాదు శతకాలు నేర్పాలి. నేను తమిళనాడు నుండి. ఇక్కడ ఏ నీతి శతకాలుంటాయో తెలియదు. అన్నారు. నేను వేమన శతకం, సుమతి శతకం అన్నాను. భాగయ్య గారు వెంటనే ..
తల్లి తండ్రుల యందు దయ లేని పుత్రుండు
పుట్టనే ని వాడు గిట్టనేని, పుట్ట లోన చెదలు పుట్టదా గిట్టదా , విశ్వదాభిరామ రామ వినుర వేమా'! అని పాడేసారు.
చూడండి ఈ పద్యం తన తల్లి తండ్రులను ఎలా చూసుకోవాలో చెప్పేది. వాడు పెద్దయ్యాక వాడికి అలా గౌరవించే విధం గా ఉండేట్లు చేస్తుంది. కాబట్టి నేర్పించాలి అన్నారు శ్రీ రామ స్వామీ గారు. సంఘం అలా చేస్తేనే రాబోయే తరం బాగు పడుతుండు అని తన అభిప్రాయం చెప్పారు.
వారికి సంఘ పరిచయం లేదు. సంఘం అలా చేయాలని, చేస్తుందని గట్టి నమ్మకం. యువకులు ఈ కామ్పేటిషన్ దగ్గర్లో స్కూల్స్ లో, అపార్మెంట్ కాంప్లెక్స్ లలో నిర్వహిస్తే కూడా దేశ కార్యం చేసినట్లే.
మీ అభిప్రాయాలు, పని చేసే వారి వివరాలు వ్రాస్తే అందరికి ఉత్సాహంగా ఉంటుంది. ప్రయత్నిస్తారా? ఈ దెబ్బతో మనకూ గొప్ప నీతి శతకాలు తెలుస్తాయి.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments